Skip to main content

Posts

Showing posts from August, 2023

అన్నిటికంటే సంపాదకీయ కవిత హైలైట్

అగస్ట్ సంచిక అందింది. అన్నిటికంటే సంపాదకీయ కవిత హైలైట్..  శ్రీ రమణ గారిపై చిక్కని కవిత మాటకు బంగారు లెక్క అమరింది.. మీ పత్రిక లో సాహిత్య గుభాల్లింపు... - కళా గోపాల్...  నిజామాబాదు 

ఆగష్టు 2023 సంచికలో 'తప్పని తప్పు' కథ చాలా బాగుంది!

 Namaste sir... how are you? Sorry, we are not in touch. Probably you remember me. I am A Raghavendra Rao, Hyderabad. I am presently in Virginia, Hyderabad. The editor sent me e magazine Visalakshi August 2023. I read your story తప్పని తప్పు..which is very interesting till the end. You made the mother and son survive. The role of Kamala has been well articulated. I always loved your stories. They are gripping and remain in the mind for a long time. Congratulations! Regards   A. Raghavendra Rao from Virginia, United States of America

గంధం చెట్టు (ఈతకోట సుబ్బారావు) - ఆడియో కథ

 ఊరంతా చేపల కంపు! ఎక్కడ పడితే అక్కడ ఇసుక తిన్నెలు. కర్రతుమ్మ పొదలు. ప్రతి గడపముందూ ఓ మురికిగుంట.      అలాంటి పట్టపుపాళెం ఊరిలో అరవై గడపలను పదిహేను వందల గడపలున్న గ్రామంగా తీర్చిదిద్దాడు రాములు.      చీఫ్ సెక్రటరీ హోదాలో దేశం మొత్తానికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలెన్నో తీసుకున్న అనుభవం 'పాళెం' ప్రయోజనానికి యేమాత్రం ఉపయోగపడినా మేలే జరుగుతుంది కానీ కీడు జరగదని మిత్రుడు శేషారెడ్డి వాదన!      'పాళెం' గుమ్మాలకి పచ్చతోరణాలు కట్టిన మనిషి, మన పిల్లలకి చదువు సంధ్య నాలుగక్షరమ్ముక్కలు కడుపులో పడేట్టు చేసిన పెద్దాయన, ఆయనగాక ఎలక్షన్ల్లో గెలిచే అర్హత ఎవరికుందన్న అభిప్రాయం మొదట్లో జనం నాలుకలపైన కదిలింది.       అలాంటి రాముల్ని ప్రసిడెంటుగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకున్నారా? లేదా డబ్బుకు అమ్ముడు పోయారా? 'పట్టపుపాళెం' రూపురేఖలు ఎలా మారాయి? తెలుసుకోవాలనుకుంటే విశాలాక్షి సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్, కవి, కథకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారు రచించిన గంధం చెట్టు అనే కథను వినండి...

ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  బత్తుల బాపూజీ గారి ముఖచిత్రంతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చింది.  బుద్ధి యజ్ఞమూర్తి, అంగర వెంకట శివ ప్రసాద్,  శరత్ చంద్ర, మేడా మస్తాన్ రెడ్డి, దాసరి శివకుమారి, పి. ఉమాదేవి, గన్నవరపు నరసింహమూర్తిల కథలు...  డా.ఎన్.గోపి, అన్నవరం దేవేందర్ లతో పాటుగా మరో నలుగురి కవితలు...  బాలి బొమ్మకు కథలు...  అట్టాడ అప్పలనాయుడు, డా.కొత్వాలు అమరేంద్రలతో పాటుగా మరో ఆరుగురి సాహితీ వ్యాసాలూ...  కొమ్మవరపు విల్సన్ రావు గారు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ తగుళ్ల గోపాల్ తో చేసిన ప్రత్యేక ముఖాముఖి... ఇంకా మరెన్నో సాహితీ గుభాళింపులతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక అందుబాటులో ఉంది... 

జూలై 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  ప్రముఖ చిత్రకారుడు సుందర్ బాబు ముఖ చిత్రం... ప్రముఖ కథకులు, కవి, విమర్శకులు శ్రీ. ఎమ్వీ. రామిరెడ్డి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ... సింహప్రసాద్, డా. ఎం. సుగుణారావు, మద్దాలి నిర్మల గార్ల కథల తో పాటు మరో ఏడు మంది రచయితల కథలు... అడిగోపుల, దాట్ల దేవదానంరాజు లాంటి ప్రముఖులు తో 12 మంది కవుల కవిత్వం... గణే శ్వరారావు, కొత్వాల్ అమరేంద్ర, శ్రీరామ్ సాగర్, బుద్ది యజ్ఞమూర్తి , Kg వేణు, డా.సుంకర గోపాల్, ఆత్మకూరు రామకృష్ణ, డా. మౌని గార్ల ప్రముఖల సాహితీ వ్యాసాలు... బాలి గారి బొమ్మకు కథలు, మోపూరు చిత్రానికి కవితలు... మరెన్నో సాహితీ గుభాళింపులతో జూలై 2023 విశాలాక్షి.

సంప్రదించండి

 విశాలాక్షి  ఇంటింటి తెలుగు సాహిత్య మాసపత్రిక  చిరునామా: ఇం.నం. 27-5-487, పద్మావతీ నగర్, SVGS కాలేజీ దగ్గర, బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్  పిన్ కోడ్: 524002 సెల్: 9246430084 ఈమెయిల్: visalakshi.nlr@gmail.com

మా మాట

  మెడికల్ వ్యాపార రంగం నుంచి  అమ్మ కోరిక మేరకు  సామాజిక రంగం వైపు  దృష్టి పెట్టాను. ఆ నేపథ్యంలో విశాలాక్షి వృద్దుల ఆశ్రమం సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసాను. ప్రస్తుతం 120 మంది అమ్మా నాన్నలు సేద తీరుతున్నారు. ఆశ్రమం అనుబంధంగా  విశాలాక్షి సాహిత్య మాస పత్రికను ఏర్పాటు చేసాను. 13 ఏళ్ల నుంచి  నిర్విరామంగా వెలువరిస్తున్నాము. తెలుగు భాష కొరకు, తెలుగు సాహిత్యం కోసం మావంతు ప్రయత్నమే విశాలాక్షి.  సాహితీ అభిమానులకు, భాషా ప్రేమికులకు మరింత చేరువ చేయాలానే  ఈ ప్రయత్నం. ఆదరించటమే కాకుండా ఆర్ధికంగా, హార్దికంగా చేయూతనిస్తూ పత్రికను నిలబెట్టుకోవలసిన బాధ్యత  పాఠకులు, అభిమానులు మీదే ఉందని మాత్రం  ఖచ్చితంగా చెప్పుతున్నాము. మీ కోసూరు రత్నం పబ్లిషర్