Skip to main content

Posts

Showing posts from October, 2023

కవిత్వం మీద మీ ప్రత్యేక శ్రద్ధ బాగా కనిపిస్తోంది

విశాలాక్షి అక్టోబర్ 2023 సంచిక ఈ రోజు చూడగలిగాను, శిఖా ఆకాష్ గారి వాట్శాప్ ద్వారా .. అప్పుడప్పుడూ వాట్శాప్ యూనివర్సిటీ కూడా కాస్త పనికొచ్చే పనులు కూడా చేస్తుందనిపించింది. 50 పేజీల్లోనే పత్రిక వైవిధ్య భరితంగా ఉంది. చక్కటి శీర్షికలున్నాయి. కవిత్వం మీద మీ ప్రత్యేక శ్రద్ధ బాగా కనిపిస్తోంది. పత్రిక ద్వారా చాలా మందిని మళ్ళీ కలిసినట్లైంది.  ప్రొ. గణేశ్వర రావు గారి కథా విశ్లేషణ  శీర్షికలో ముకుంద రామారావు గారి కథను విశ్లేషించిన  తీరు చెహోవ్ కథతో  పోలిక బావుంది.  కవి మణిందర్ గారితో విల్సన్ రావు గారి ఇంటర్వ్యూ లో మాణిక్యాల రావు గారు తన గురువుగారు ఫ్రముఖ కవి కీ శే ఎండ్లూరి సుధాకర్ గారిని గుర్తుచేసుకోవడం సముచితం.  రామకవచం గారి కవితాస్త్రం లో ఆచార్య గోపీ గారి కవిత పరామర్శ శాస్త్ర బద్ధంగా ఉంది.   బాలాజీ గారి కవిత  పసి పిల్లలతో ఆడుకోవడం లో ఉండే మనసు తేలికవడాన్నీ, ఆనందాన్నీ,  త్రుప్తినీ, ఫలితంగా జీవనం లో కలిగే పునరుత్తేజాన్నీ రుచి చూపించింది.  గద్దర్ గారి మీద శిఖా ఆకాష్ కవిత, డా పద్మారావు గారి "వారే విజేతలు" కవితలో " వారు బహు ధ్వనులు  బహుజనులు "అనే వ్యక్తీకరణ చాలా బావుంది.  నా కవిత

జీవకళ ఉట్టి పడుతూ అబ్బుర పరుస్తున్నాయి

అక్టోబర్ 2023 విశాలాక్షిలో ఎడిటర్ గారి సంపాదకీయంలో బతికున్న మేఘమని కీర్తి శేషులు చిరంజీవి గారిని వర్ణించి ఆయనకి నివాళులు అర్పించారు.  ముఖచిత్ర కథగా లెజెండ్ చిత్రకారుడు  బత్తుల బాపూజీ గురించి రజా హుస్సేన్ గారు చక్కగా వివరించి వారి జీవిత విశేషాలను తెలియ చేసారు. వారి చిత్రాలలో జీవకళ ఉట్టి పడుతూ అబ్బుర పరుస్తున్నాయి. వసంతగీతం కథ చాలా చక్కగా సాగింది. ఒక పక్షి ప్రాణం కంటే నా ఉక్కపోత ముఖ్యమా? ఎ.సి. లేకపోతే వారం రోజులు భరించ  లేమా? అనే సందేశాన్ని రచయిత్రి అనసూయ గారు కథగా చక్కగా మలిచారు.  కవితల్లో పలమనేరు బాలాజీ గారి “పాప చేతుల్లో ఉన్నపుడు “ కవిత బాగుంది. చిన్న పిల్లలు దైవ సమానులు అని ఊరికే అనలేదు కదా!  విశాలాక్షి వార్షికోత్సవ సంబరాలు దిగ్విజయంగా జరగాలని కోరుకొంటూ .. -  రాధాయి హైదరాబాద్ 500 068

అక్టోబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  అక్టోబర్2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  ఆకట్టుకునే బహుమతి కథలు, ఆలోచింపజేసే  కవితలు,  పుస్తక పరిచయాలు,  కొమ్మవరపు విల్సన్ రావు గారు నిర్వహించే ముఖాముఖి, కోసూరు రత్నం గారి సంపాదకీయం,  పోటీల ఫలితాలు, కొత్త పోటీల ప్రకటనలు, కొత్త శీర్షిక ప్రారంభం, బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...     

సాహితీ మిత్రులకు సాదర స్వాగతం!

 విశాలాక్షి సాహిత్య మాస పత్రిక నిర్వహించిన పోటీల విజేతలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ప్రియమైన పాఠకులకు మా స్వాగతం. ఈ కార్యక్రమం మనది . అందరం కలసి చేసుకునేది. మీరు తప్పక హాజరు అయి సభను విజయవంతం చేయగలరు 🙏     ఆహ్వాన పత్రికను డౌన్లోడ్ చేయడానికి క్లిక్ చేయండి!