Skip to main content

కవిత్వం మీద మీ ప్రత్యేక శ్రద్ధ బాగా కనిపిస్తోంది

విశాలాక్షి అక్టోబర్ 2023 సంచిక ఈ రోజు చూడగలిగాను, శిఖా ఆకాష్ గారి వాట్శాప్ ద్వారా .. అప్పుడప్పుడూ వాట్శాప్ యూనివర్సిటీ కూడా కాస్త పనికొచ్చే పనులు కూడా చేస్తుందనిపించింది.

50 పేజీల్లోనే పత్రిక వైవిధ్య భరితంగా ఉంది. చక్కటి శీర్షికలున్నాయి. కవిత్వం మీద మీ ప్రత్యేక శ్రద్ధ బాగా కనిపిస్తోంది. పత్రిక ద్వారా చాలా మందిని మళ్ళీ కలిసినట్లైంది. 

ప్రొ. గణేశ్వర రావు గారి కథా విశ్లేషణ  శీర్షికలో ముకుంద రామారావు గారి కథను విశ్లేషించిన  తీరు చెహోవ్ కథతో  పోలిక బావుంది. 

కవి మణిందర్ గారితో విల్సన్ రావు గారి ఇంటర్వ్యూ లో మాణిక్యాల రావు గారు తన గురువుగారు ఫ్రముఖ కవి కీ శే ఎండ్లూరి సుధాకర్ గారిని గుర్తుచేసుకోవడం సముచితం. 

రామకవచం గారి కవితాస్త్రం లో ఆచార్య గోపీ గారి కవిత పరామర్శ శాస్త్ర బద్ధంగా ఉంది.  

బాలాజీ గారి కవిత  పసి పిల్లలతో ఆడుకోవడం లో ఉండే మనసు తేలికవడాన్నీ, ఆనందాన్నీ,  త్రుప్తినీ, ఫలితంగా జీవనం లో కలిగే పునరుత్తేజాన్నీ రుచి చూపించింది. 

గద్దర్ గారి మీద శిఖా ఆకాష్ కవిత, డా పద్మారావు గారి "వారే విజేతలు" కవితలో " వారు బహు ధ్వనులు  బహుజనులు "అనే వ్యక్తీకరణ చాలా బావుంది. 

నా కవిత "బంధాలు" ప్రచురించినందుకు  సంపాదక వర్గానికీ, మీకూ నా  ధన్యవాదాలు. ఆరు నెలల తరవాత తొలిసారి ప్రచురణ కోసం పంపించిన కవిత అది. మీకు నచ్చినందుకు  ప్రచురణార్హమైనందుకు సంతోషం.

పత్రిక మొత్తం చూశాక పాత రోజుల్లో నెల్లూర్లో కోమల విలాస్ లో మొలగొలుకుల  బియ్యంతో చేసిన వేడి వేడి అన్నంలో  పచ్చి మిరప కాయల పచ్చడీ, కంది పప్పూ, నెయ్యి కలుపుకొని తిని గడ్డ పెరుగుతో భోజనం ముగించినట్టుగా ఉంది.

మీ అక్షర సేద్యం నిప్పో ఫేక్టరీ ఎదురుగా ఉండే నవలాకుల తోటలా కొనసాగించండి.

మీ సంపాదకుల వారు రత్నం గారు అహం గురించి మంచి కథే చెప్పేరు. ఖాజ మొహిద్దీన్ గారికి మీ నివాళి ఆర్ద్రంగా ఉంది.  పత్రికను చక్కగా తీసుకు వస్తున్న మీ సంపాదక బ్రుందానికి శుభాభినందనలు.  

శుభాకాంక్షలతో  

డా విద్యాసాగర్ అంగలకుర్తి 

విశ్రాంత ఐ యే ఎస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
హైదరాబాదు
20.10.2023

Comments

Popular posts from this blog

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఇంద్రగంటి మధుసూదనరావు,  మోపూరు పెంచల నరసింహం, రోహిణి వంజారి, విల్సన్ రావు, డా।। మాడభూషి సంపత్ కుమార్,  మేడా మస్తాన్ రెడ్డి, కలబగిరి వేంకట బానుభూషణ్,  డా।। ఎన్. గోపి, డా।। కటుకోజ్వల రమేష్,  మొదలి పద్మ గార్ల కవితలు...  గడిపాటి వెంకట హేమలత,  డా।। కౌలూరి ప్రసాద్ రావు, విహారి, దేశరాజు, ముక్తాల నరేంద్ర, శింగరాజు శ్రీనివాసరావు గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'నాన్నకు కన్నీళ్లు ఉన్నాయి' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం.. 'గుప్పెడు మల్లెలు చాలు' అంటోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-44'...  "పదాల వెనుక కాలాన్ని వెదికే ‘పద’గామి! డా|| జి.వి. పూర్ణచందుతో మేధో సంభాషణ" ఈతకోట సుబ్బారావు గారు చేసిన ముఖాముఖి ప్రత్యేకం! లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికల...

జూన్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి జూన్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా.ఎన్.గోపి, పద్మావతి రాంభక్త, రోహిణి వంజారి, కొల్లూరి, మేడా మస్తాన్ రెడ్డి, బండి మేఘన, ఏనుగు నరసింహారెడ్డి, శారద ఆవాల, శుభామహి నూచెర్ల, కరణం హనుమంతురావు గార్ల కవితలు. వాణిశ్రీ, దాసరి చంద్రయ్య, డా.దారల విజయ కుమారి, ఏరువ శ్రీనాథ్ రెడ్డి, పొన్నాడ సత్య ప్రకాష్ రావు, ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి, డా.లక్ష్మీ రాఘవ గార్ల కథలు, శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... శ్రీ ఎమ్వీ రామిరెడ్డి, ఆకుల మల్లేశ్వరరావు గార్ల సమీక్షలు, కొమ్మవరపు విల్సన్ రావు గారు అందిస్తోన్న ముఖాముఖి, 'ఆకలైతే అన్నం పెట్టండయ్యా' అంటోన్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  బత్తుల బాపూజీ గారి ముఖచిత్రంతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చింది.  బుద్ధి యజ్ఞమూర్తి, అంగర వెంకట శివ ప్రసాద్,  శరత్ చంద్ర, మేడా మస్తాన్ రెడ్డి, దాసరి శివకుమారి, పి. ఉమాదేవి, గన్నవరపు నరసింహమూర్తిల కథలు...  డా.ఎన్.గోపి, అన్నవరం దేవేందర్ లతో పాటుగా మరో నలుగురి కవితలు...  బాలి బొమ్మకు కథలు...  అట్టాడ అప్పలనాయుడు, డా.కొత్వాలు అమరేంద్రలతో పాటుగా మరో ఆరుగురి సాహితీ వ్యాసాలూ...  కొమ్మవరపు విల్సన్ రావు గారు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ తగుళ్ల గోపాల్ తో చేసిన ప్రత్యేక ముఖాముఖి... ఇంకా మరెన్నో సాహితీ గుభాళింపులతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక అందుబాటులో ఉంది...