Skip to main content

Posts

Showing posts with the label ఆడియో కథలు

నెల్లూరు చరిత్ర

  నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల చరిత్రను చారిత్రక ఆధారాలతో కాలనిర్ణయాలతో చాలా చక్కగా విశ్లేషించిన వీడియో ఇది...  

గంధం చెట్టు (ఈతకోట సుబ్బారావు) - ఆడియో కథ

 ఊరంతా చేపల కంపు! ఎక్కడ పడితే అక్కడ ఇసుక తిన్నెలు. కర్రతుమ్మ పొదలు. ప్రతి గడపముందూ ఓ మురికిగుంట.      అలాంటి పట్టపుపాళెం ఊరిలో అరవై గడపలను పదిహేను వందల గడపలున్న గ్రామంగా తీర్చిదిద్దాడు రాములు.      చీఫ్ సెక్రటరీ హోదాలో దేశం మొత్తానికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలెన్నో తీసుకున్న అనుభవం 'పాళెం' ప్రయోజనానికి యేమాత్రం ఉపయోగపడినా మేలే జరుగుతుంది కానీ కీడు జరగదని మిత్రుడు శేషారెడ్డి వాదన!      'పాళెం' గుమ్మాలకి పచ్చతోరణాలు కట్టిన మనిషి, మన పిల్లలకి చదువు సంధ్య నాలుగక్షరమ్ముక్కలు కడుపులో పడేట్టు చేసిన పెద్దాయన, ఆయనగాక ఎలక్షన్ల్లో గెలిచే అర్హత ఎవరికుందన్న అభిప్రాయం మొదట్లో జనం నాలుకలపైన కదిలింది.       అలాంటి రాముల్ని ప్రసిడెంటుగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకున్నారా? లేదా డబ్బుకు అమ్ముడు పోయారా? 'పట్టపుపాళెం' రూపురేఖలు ఎలా మారాయి? తెలుసుకోవాలనుకుంటే విశాలాక్షి సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్, కవి, కథకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారు రచించిన గంధం చెట్టు అనే కథను వినండి...