Skip to main content

మా మాట

           మెడికల్ వ్యాపార రంగం నుంచి  అమ్మ కోరిక మేరకు  సామాజిక రంగం వైపు  దృష్టి పెట్టాను. ఆ నేపథ్యంలో విశాలాక్షి వృద్దుల ఆశ్రమం సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసాను. ప్రస్తుతం 120 మంది అమ్మా నాన్నలు సేద తీరుతున్నారు. ఆశ్రమం అనుబంధంగా  విశాలాక్షి సాహిత్య మాస పత్రికను ఏర్పాటు చేసాను. 13 ఏళ్ల నుంచి  నిర్విరామంగా వెలువరిస్తున్నాము. తెలుగు భాష కొరకు, తెలుగు సాహిత్యం కోసం మావంతు ప్రయత్నమే విశాలాక్షి.  సాహితీ అభిమానులకు, భాషా ప్రేమికులకు మరింత చేరువ చేయాలానే  ఈ ప్రయత్నం. ఆదరించటమే కాకుండా ఆర్ధికంగా, హార్దికంగా చేయూతనిస్తూ పత్రికను నిలబెట్టుకోవలసిన బాధ్యత  పాఠకులు, అభిమానులు మీదే ఉందని మాత్రం  ఖచ్చితంగా చెప్పుతున్నాము.

మీ

కోసూరు రత్నం

పబ్లిషర్

Comments