Skip to main content

Posts

Showing posts with the label గత సంచికలు

ఏప్రిల్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి ఏప్రిల్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా.ఎన్.గోపి, డా.కె.రమేష్, వి.ఎస్.ఆర్.కేశవరావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, కుడికాల వంశీధర్, ఘాలి లలిత ప్రవల్లిక, ఇంద్రగంటి మధుసూదనరావు గార్ల కవితలు. వి.రాజారామమోహనరావు, గొర్తి వాణి శ్రీనివాస్, గిడ్డకింద మాణిక్యం, మల్లారెడ్డి మురళీమోహన్, డా.మనోహర్ కోటకొండ, సయ్యద్ నజ్మా షమ్మీ, రాచపూడి రమేష్ గార్ల కథలు, శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారి సమీక్ష, 'ఇంకా నేర్చుకుందాం' అని  చెప్పే శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

మార్చ్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

    విశాలాక్షి మార్చ్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  కె శివారెడ్డి, డా.పాతూరి అన్నపూర్ణ, ఏనుగు నరసింహారెడ్డి, దాట్ల దేవదానం రాజు, మల్లాప్రగడ రామారావు గారి కవితలు. డా. జడా సుబ్బారావు, వసుంధర, ఇంద్రగంటి మధుసూదన రావు, ఎం రమేష్ కుమార్,  మంచికంటి గారి కథలు, శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు, మినీ కథల పోటీ, కవితల పోటీ ప్రకటనలు... శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... ప్రముఖ పాత్రికేయులు, కథకులు, కవి, ఆర్టిస్ట్, సద్విమర్శకులు శ్రీ ముని సురేష్ పిళ్ళై గారు ఈమధ్యనే వెలువరించిన "షష్ఠముడు" కవితాసంపుటిపై శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారి ముందుమాటతోపాటుగా మరికొన్ని పుస్తక పరిచయాలు, మూర్ఖునితో స్నేహం కంటే ఒంటరిగా ఉండటం మేలంటూ 'జాగ్రత్త సుమా...' అని మనల్ని హెచ్చరిస్తూ జాగ్రత్తలు చెప్పే శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...    

ఫిబ్రవరి 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

   విశాలాక్షి ఫిబ్రవరి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన శ్రీమతి గొర్తి వాణీశ్రీనివాస్ గారి కథ "జ్ఞానాంభుది" ప్రచురితమైంది.  ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన శ్రీ దాట్ల దేవదానం రాజు గారి కథ "వాగ్దాన పరిమళం" ప్రచురితమైంది.  బ్రహ్మశ్రీ కడయింటి వెంకట సుబ్రహ్మణ్యం, చెంచులక్షి గార్ల స్మారక మినీ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఆచార్య వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారి "మహిళా సాధికార కథ" ప్రచురితమైంది. అంతేకాకుండా మీ మనసు దోచుకునే మరిన్ని కథలు, ఆలోచింపజేసే  కవితలు,  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కొత్త సీరియల్ "కల్యాణం కమనీయం", పుస్తక పరిచయాలు, కాలానికి గమ్యం అంటూ సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...    

జనవరి 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  ఈ నూతన సంవత్సరంలో మీ ఆనందాలను మరింతగా పెంచడానికి విశాలాక్షి జనవరి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఈ సంవత్సరం కానుకగా ప్రముఖ కథకులు శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారి ప్రత్యేక ముఖాముఖితోపాటుగా, ఆయన "మొండి శిఖండి" కథను విశాలాక్షి మీకు అందిస్తోంది. ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన శ్రీ డా.ఎమ్.సుగుణరావు గారి కథ "ధర్మ దేవత" ప్రచురితమైంది.  అంతేకాకుండా మీ మనసు దోచుకునే మరిన్ని కథలు, ఆలోచింపజేసే  కవితలు,  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కొత్త సీరియల్ "కల్యాణం కమనీయం" ప్రారంభం, పుస్తక పరిచయాలు, కోసూరు రత్నం గారి సంపాదకీయం, "సముద్రం" అనే అంశం మీద కథల పోటీల ప్రకటనలు, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...    

డిసెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

డిసెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  విశాలాక్షి సాహిత్య మాస పత్రిక, ఓలేటి వెంకట సుబ్బారావు సంయుక్త  రైతు కథల పోటీల్లో బహుమతి పొందిన కథలు, ఆలోచింపజేసే  కవితలు,  'సొగసైన తెలుగు' అంటూ డా.జి.వి.పూర్ణచందు గారి వ్యాసం, చెరుకూరి సత్యనారాయణ గారి విశ్లేషణ, ఈ తరం కోసమే నా సాహిత్యం అంటోన్న గన్నవరపు నరసింహమూర్తి గారి ముఖాముఖి మేడా మస్తాన్ రెడీ గారితో, ముంబాయి కవన తరంగాలు గురించి ఏమ్వీ రామిరెడ్డి గారు చెప్పే ఒకమాట, పుస్తక పరిచయాలు, కోసూరు రత్నం గారి సంపాదకీయం, రెండు కొత్త పోటీల ప్రకటనలు, ప్రారంభమైన కొత్త శీర్షిక, బాలి బొమ్మ - 41, బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...    

నవంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  నవంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  విశాలాక్షి ద్విదశాబ్ది ఉత్సవాల విశేషాలు, ఆకట్టుకునే కథలు, ఆలోచింపజేసే  కవితలు,  పుస్తక పరిచయాలు,  కొమ్మవరపు విల్సన్ రావు గారు నిర్వహించే ముఖాముఖి, కోసూరు రత్నం గారి సంపాదకీయం, రెండు కొత్త పోటీల ప్రకటనలు, ప్రారంభమైన కొత్త శీర్షిక, బాలి బొమ్మ - 41, బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

అక్టోబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  అక్టోబర్2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  ఆకట్టుకునే బహుమతి కథలు, ఆలోచింపజేసే  కవితలు,  పుస్తక పరిచయాలు,  కొమ్మవరపు విల్సన్ రావు గారు నిర్వహించే ముఖాముఖి, కోసూరు రత్నం గారి సంపాదకీయం,  పోటీల ఫలితాలు, కొత్త పోటీల ప్రకటనలు, కొత్త శీర్షిక ప్రారంభం, బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...     

సెప్టెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

సెప్టెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  ఆకట్టుకునే కథలు, ఆలోచింపజేసే  కవితలు,  పుస్తక పరిచయాలు,  కొమ్మవరపు విల్సన్ రావు గారు నిర్వహించే ముఖాముఖి, ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం,  బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో... 

ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  బత్తుల బాపూజీ గారి ముఖచిత్రంతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చింది.  బుద్ధి యజ్ఞమూర్తి, అంగర వెంకట శివ ప్రసాద్,  శరత్ చంద్ర, మేడా మస్తాన్ రెడ్డి, దాసరి శివకుమారి, పి. ఉమాదేవి, గన్నవరపు నరసింహమూర్తిల కథలు...  డా.ఎన్.గోపి, అన్నవరం దేవేందర్ లతో పాటుగా మరో నలుగురి కవితలు...  బాలి బొమ్మకు కథలు...  అట్టాడ అప్పలనాయుడు, డా.కొత్వాలు అమరేంద్రలతో పాటుగా మరో ఆరుగురి సాహితీ వ్యాసాలూ...  కొమ్మవరపు విల్సన్ రావు గారు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ తగుళ్ల గోపాల్ తో చేసిన ప్రత్యేక ముఖాముఖి... ఇంకా మరెన్నో సాహితీ గుభాళింపులతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక అందుబాటులో ఉంది... 

జూలై 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  ప్రముఖ చిత్రకారుడు సుందర్ బాబు ముఖ చిత్రం... ప్రముఖ కథకులు, కవి, విమర్శకులు శ్రీ. ఎమ్వీ. రామిరెడ్డి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ... సింహప్రసాద్, డా. ఎం. సుగుణారావు, మద్దాలి నిర్మల గార్ల కథల తో పాటు మరో ఏడు మంది రచయితల కథలు... అడిగోపుల, దాట్ల దేవదానంరాజు లాంటి ప్రముఖులు తో 12 మంది కవుల కవిత్వం... గణే శ్వరారావు, కొత్వాల్ అమరేంద్ర, శ్రీరామ్ సాగర్, బుద్ది యజ్ఞమూర్తి , Kg వేణు, డా.సుంకర గోపాల్, ఆత్మకూరు రామకృష్ణ, డా. మౌని గార్ల ప్రముఖల సాహితీ వ్యాసాలు... బాలి గారి బొమ్మకు కథలు, మోపూరు చిత్రానికి కవితలు... మరెన్నో సాహితీ గుభాళింపులతో జూలై 2023 విశాలాక్షి.