Skip to main content

ఎడిటర్ మాట

 అందరికీ నమస్కారం!

     విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 13 ఏళ్లుగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, కష్టకాలంను కూడా అధిగమిస్తూ, ఒక ప్రవాహంలా తీసుకు వస్తున్నాం. సహజంగా దీని వెనుక మా ప్రకటన కర్తలు, వ్యాపార సంస్థలు, చందాదారులు అని చెబుతూ రావాలి. కానీ, మాకు అలాంటి అవసరం రాలేదు. అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రకటనలు  వేసింది లేదు.

       నిజానికి 13 ఏళ్లుగా 4000 ప్రతులు పంపుతూ ఉంటే 50 మంది చందాదారులు కూడా ఈరోజుకు మాకు లేదని ఎలా చెప్పుకోవాలో ఒక దిక్కుతోచని పరిస్థితి మాది. అయినప్పటికీ కేవలం మా యజమాని, నిర్వాహకులు కోసూరు రత్నం గారు ఒక అకుంఠిత దీక్షతోనే ఈ పత్రికను తీసుకువస్తున్నారు. 

        అనేక నష్టాలను కష్టాలను చవిచూస్తున్నా, "ఏం కాదు... మనం చేయాల్సిన బాధ్యత మన చేద్దాం" అంటూనే ఆయన ముందుకు నడుస్తున్నారు. 

        తొలి ఏళ్లలో 'చందాలు కట్టండి' అని ప్రతినెల మా పత్రికలోని ప్రకటనలు ఇస్తూ వచ్చాము. అయినప్పటికీ ఏ ఒక్కరో ఇద్దరో తప్పించి మరే స్పందనా లేదు. అందుకనే ఆ ప్రకటన ఇవ్వటం కూడా మానేశాం. 

        కానీ, 'మా కవిత వేయండి' అనో, 'మా సమీక్ష వేయండి' అనో, లేదా 'మా కథ వేయండి' అనో అడిగే రచయితలు, ఎప్పుడన్నా వారివి వేయకపోతే వేయలేదనే నిష్ఠురాలు, ప్రశ్నలు వింటూనే ఉంటాం. అయినా దానికి మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే మా పత్రికలో రావాలని కోరిక వ్యక్తం చేయడం కూడా మాకు ఆనందంగానూ గర్వంగానూ ఉంటుంది. 

        అంతే సూటిగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే 'పత్రికకు పాఠకులే మూల స్తంభాలుగా నిలబడాలని, నిలబడతారని' ఆశిస్తూ...

మీ

ఈతకోట సుబ్బారావు

సంపాదకుడు 


Comments

Popular posts from this blog

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఇంద్రగంటి మధుసూదనరావు,  మోపూరు పెంచల నరసింహం, రోహిణి వంజారి, విల్సన్ రావు, డా।। మాడభూషి సంపత్ కుమార్,  మేడా మస్తాన్ రెడ్డి, కలబగిరి వేంకట బానుభూషణ్,  డా।। ఎన్. గోపి, డా।। కటుకోజ్వల రమేష్,  మొదలి పద్మ గార్ల కవితలు...  గడిపాటి వెంకట హేమలత,  డా।। కౌలూరి ప్రసాద్ రావు, విహారి, దేశరాజు, ముక్తాల నరేంద్ర, శింగరాజు శ్రీనివాసరావు గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'నాన్నకు కన్నీళ్లు ఉన్నాయి' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం.. 'గుప్పెడు మల్లెలు చాలు' అంటోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-44'...  "పదాల వెనుక కాలాన్ని వెదికే ‘పద’గామి! డా|| జి.వి. పూర్ణచందుతో మేధో సంభాషణ" ఈతకోట సుబ్బారావు గారు చేసిన ముఖాముఖి ప్రత్యేకం! లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికల...

డిసెంబర్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

 విశాలాక్షి డిసెంబర్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా।। ఎన్. గోపి, ఆశారాజు, ప్రొ।।రామచంంద్రమౌళి, పద్మావతి రాంభక్త , శైలజామిత్ర, అన్నం శివకృష్ణ ప్రసాద్, అవ్వాారు శ్రీధర్ బాబు, ర్యాాలి ప్రసాద్, గార రంగనాథం, అన్నవరం దేవేందర్, కలబరిగి వేంంకట భానుభూషణ్, చిట్టేల శ్రీధర్ కుమార్ గార్ల కవితలు...  ఎమ్. సుగుణారావు, ఇంంద్రగంంటి మధుసూధనరావు, శ్రీ విజయదుర్గ, ఎల్. కడయింంటి కృృష్ణణమూర్తి గార్ల కథలు...  శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు-11...  శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారిణి శ్రీమతి అల్లాడి రోహిణి గారి గురించి సమున్నత వ్యాసం అందించిన ఈతకోట సుబ్బారావు గారు.. వజ్రోత్సవ జన్మదినం జరుపుకుంటున్న ప్రముఖ సాహితీమూర్తి, నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరు గడించిన శ్రీమతి సుభద్రాదేవి గారి ముఖాముఖి ప్రత్యేకం... కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-39'...  వృద్ధాప్యానికి బంగారు సూత్రాలు చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. 'మౌనాన్ని పలికించే రాగం' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్...

ఏప్రిల్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

ఏప్రిల్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా।। ఎన్. గోపి, ములుగు లక్ష్మీ మైథిలి, మొగతపల్లి స్వాతీరాణి, సునీత గంగవరపు, భమిడిపాటి విజయలక్ష్మి,  బొమ్మగాని నాగేశ్వరరావు గార్ల కవితలు...  నామని సుజనాదేవి, డా।। ఎం. కోటేశ్వరరావు, ఉప్పలూరి మధుపత్ర శైలజ, తిరుమలశ్రీ, విజయశ్రీమఖి, డా।। నగరం వినోద్ కుమార్,  గన్నవరపు నరసింహమూర్తి గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'చెట్టులాంటి నాన్న' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి సంపాదకీయం.. 'అభివృద్ధి కావాలి' అంటోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-43'...  'అర్థం చేసుకోలేక జడ్జ్ చేయడం సాహితీలోకరీతి - ప్రసేన్' గారితో ఈతకోట సుబ్బారావు గారు చేసిన ముఖాముఖి ప్రత్యేకం! లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...