Skip to main content

జీవకళ ఉట్టి పడుతూ అబ్బుర పరుస్తున్నాయి

అక్టోబర్ 2023 విశాలాక్షిలో ఎడిటర్ గారి సంపాదకీయంలో బతికున్న మేఘమని కీర్తి శేషులు చిరంజీవి గారిని
వర్ణించి ఆయనకి నివాళులు అర్పించారు. 

ముఖచిత్ర కథగా లెజెండ్ చిత్రకారుడు  బత్తుల బాపూజీ గురించి
రజా హుస్సేన్ గారు చక్కగా వివరించి వారి జీవిత విశేషాలను తెలియ చేసారు.

వారి చిత్రాలలో జీవకళ ఉట్టి పడుతూ అబ్బుర పరుస్తున్నాయి.

వసంతగీతం కథ చాలా చక్కగా సాగింది. ఒక పక్షి ప్రాణం కంటే నా ఉక్కపోత
ముఖ్యమా? ఎ.సి. లేకపోతే వారం రోజులు భరించ  లేమా? అనే సందేశాన్ని రచయిత్రి అనసూయ గారు కథగా
చక్కగా మలిచారు. 

కవితల్లో పలమనేరు బాలాజీ గారి “పాప చేతుల్లో ఉన్నపుడు “ కవిత బాగుంది. చిన్న పిల్లలు
దైవ సమానులు అని ఊరికే అనలేదు కదా! 

విశాలాక్షి వార్షికోత్సవ సంబరాలు దిగ్విజయంగా జరగాలని కోరుకొంటూ ..

రాధాయి

హైదరాబాద్ 500 068

Comments

Popular posts from this blog

ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  బత్తుల బాపూజీ గారి ముఖచిత్రంతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చింది.  బుద్ధి యజ్ఞమూర్తి, అంగర వెంకట శివ ప్రసాద్,  శరత్ చంద్ర, మేడా మస్తాన్ రెడ్డి, దాసరి శివకుమారి, పి. ఉమాదేవి, గన్నవరపు నరసింహమూర్తిల కథలు...  డా.ఎన్.గోపి, అన్నవరం దేవేందర్ లతో పాటుగా మరో నలుగురి కవితలు...  బాలి బొమ్మకు కథలు...  అట్టాడ అప్పలనాయుడు, డా.కొత్వాలు అమరేంద్రలతో పాటుగా మరో ఆరుగురి సాహితీ వ్యాసాలూ...  కొమ్మవరపు విల్సన్ రావు గారు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ తగుళ్ల గోపాల్ తో చేసిన ప్రత్యేక ముఖాముఖి... ఇంకా మరెన్నో సాహితీ గుభాళింపులతో ఆగష్టు 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక అందుబాటులో ఉంది... 

సెప్టెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

సెప్టెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  ఆకట్టుకునే కథలు, ఆలోచింపజేసే  కవితలు,  పుస్తక పరిచయాలు,  కొమ్మవరపు విల్సన్ రావు గారు నిర్వహించే ముఖాముఖి, ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం,  బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో... 

జనవరి 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  ఈ నూతన సంవత్సరంలో మీ ఆనందాలను మరింతగా పెంచడానికి విశాలాక్షి జనవరి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఈ సంవత్సరం కానుకగా ప్రముఖ కథకులు శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారి ప్రత్యేక ముఖాముఖితోపాటుగా, ఆయన "మొండి శిఖండి" కథను విశాలాక్షి మీకు అందిస్తోంది. ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన శ్రీ డా.ఎమ్.సుగుణరావు గారి కథ "ధర్మ దేవత" ప్రచురితమైంది.  అంతేకాకుండా మీ మనసు దోచుకునే మరిన్ని కథలు, ఆలోచింపజేసే  కవితలు,  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కొత్త సీరియల్ "కల్యాణం కమనీయం" ప్రారంభం, పుస్తక పరిచయాలు, కోసూరు రత్నం గారి సంపాదకీయం, "సముద్రం" అనే అంశం మీద కథల పోటీల ప్రకటనలు, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...