Skip to main content

Posts

Showing posts from September, 2025

సెప్టెంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

శీలా వీర్రాజు స్మారక కవితల పోటీలో మూడు విభాగాలలో బహుమతులు పొందిన కవితలతో మొదలైన సెప్టెంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చేసింది.  డాక్టర్ ఎన్.గోపి, కరిపె రాజ్ కుమార్, రాయసం దామోదర్, డా.రాధేయ, టి.వి.యల్.గాయత్రి, తోట సులోచన గార్ల కవితలు...  రామా చంద్రమౌళి, పి.వి.ఆర్.శివ కుమార్, ఎండపల్లి భారతి, వి.శారద, వి.రాజారామోహనరావు, మంచికంటి, సింహప్రసాద్, చంద్ర ప్రతాప్ కంతేటి గార్ల కథలు...  యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, శింగమాల సుబ్రహ్మణ్యం గార్ల శీర్షికలు... 'అమ్మా, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు' గురించి చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. 'ఇంగువ గుడ్డ' వచన కవితా సంపాదకీయం అందిస్తోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారు.. ఏటుకూరి ప్రసాద్ గారితో డా.రాపోలు సుదర్శన్ గారు నిర్వహించిన ముఖాముఖి ప్రత్యేకం! వర్చస్వి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...