Skip to main content

Posts

జనవరి 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  ఈ నూతన సంవత్సరంలో మీ ఆనందాలను మరింతగా పెంచడానికి విశాలాక్షి జనవరి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఈ సంవత్సరం కానుకగా ప్రముఖ కథకులు శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారి ప్రత్యేక ముఖాముఖితోపాటుగా, ఆయన "మొండి శిఖండి" కథను విశాలాక్షి మీకు అందిస్తోంది. ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన శ్రీ డా.ఎమ్.సుగుణరావు గారి కథ "ధర్మ దేవత" ప్రచురితమైంది.  అంతేకాకుండా మీ మనసు దోచుకునే మరిన్ని కథలు, ఆలోచింపజేసే  కవితలు,  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కొత్త సీరియల్ "కల్యాణం కమనీయం" ప్రారంభం, పుస్తక పరిచయాలు, కోసూరు రత్నం గారి సంపాదకీయం, "సముద్రం" అనే అంశం మీద కథల పోటీల ప్రకటనలు, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...    

నెల్లూరు చరిత్ర

  నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల చరిత్రను చారిత్రక ఆధారాలతో కాలనిర్ణయాలతో చాలా చక్కగా విశ్లేషించిన వీడియో ఇది...  

డిసెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

డిసెంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  విశాలాక్షి సాహిత్య మాస పత్రిక, ఓలేటి వెంకట సుబ్బారావు సంయుక్త  రైతు కథల పోటీల్లో బహుమతి పొందిన కథలు, ఆలోచింపజేసే  కవితలు,  'సొగసైన తెలుగు' అంటూ డా.జి.వి.పూర్ణచందు గారి వ్యాసం, చెరుకూరి సత్యనారాయణ గారి విశ్లేషణ, ఈ తరం కోసమే నా సాహిత్యం అంటోన్న గన్నవరపు నరసింహమూర్తి గారి ముఖాముఖి మేడా మస్తాన్ రెడీ గారితో, ముంబాయి కవన తరంగాలు గురించి ఏమ్వీ రామిరెడ్డి గారు చెప్పే ఒకమాట, పుస్తక పరిచయాలు, కోసూరు రత్నం గారి సంపాదకీయం, రెండు కొత్త పోటీల ప్రకటనలు, ప్రారంభమైన కొత్త శీర్షిక, బాలి బొమ్మ - 41, బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...    

నవంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  నవంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  విశాలాక్షి ద్విదశాబ్ది ఉత్సవాల విశేషాలు, ఆకట్టుకునే కథలు, ఆలోచింపజేసే  కవితలు,  పుస్తక పరిచయాలు,  కొమ్మవరపు విల్సన్ రావు గారు నిర్వహించే ముఖాముఖి, కోసూరు రత్నం గారి సంపాదకీయం, రెండు కొత్త పోటీల ప్రకటనలు, ప్రారంభమైన కొత్త శీర్షిక, బాలి బొమ్మ - 41, బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

విశాలాక్షి ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనవిజయం!!

          నెల్లూరు నగరంలోని టౌన్‌ హాల్‌లో అక్టోబరు 29, 2023 ఆదివారం సాయంకాలం అంగరంగవైభవంగా విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం, విశాలాక్షి సాహిత్య మాసపత్రిక వార్షికోత్సవ సంబరాలు జరిగాయి. కథ, కవిత, మినీ కథ, కార్టూన్‌ పోటీలలో విజేతలైన వంద మంది సాహితీకారులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సభకు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహించారు. శ్రీ ఎమ్‌.వి. రామిరెడ్డి గారు, ప్రముఖ కవి, కథకులు, ఆత్మీయ అతిథిగా ప్రముఖ కథానవలా రచయిత్రి డాక్టర్‌ పెల్లకూరి జయప్రద సమావేశానికి విచ్చేసి అమూల్యమైన సందేశాన్నిచ్చారు.           ఈ కార్యక్రమంలోనే డాక్టర్‌ పాలంకి రాధిక, విశ్రాంత కాలేజీ ప్రిన్సిపాల్‌ గారికి, చలంచెర్ల భాస్కరరెడ్డి, తెలుగు బాషోద్యమ నాయకులకు విశాలాక్షి పురస్కారాన్ని అందజేసారు.           కోసూరు రత్నం, విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపకులు, విశాలాక్షి మాసపత్రిక ప్రచురణకర్త సభను ప్రారంభించారు. వృద్ధుల ఆశ్రమం ఇరవై యేళ్ల క్రితం స్థాపించిన సందర్భాన్ని, అలాగే ...

కవిత్వం మీద మీ ప్రత్యేక శ్రద్ధ బాగా కనిపిస్తోంది

విశాలాక్షి అక్టోబర్ 2023 సంచిక ఈ రోజు చూడగలిగాను, శిఖా ఆకాష్ గారి వాట్శాప్ ద్వారా .. అప్పుడప్పుడూ వాట్శాప్ యూనివర్సిటీ కూడా కాస్త పనికొచ్చే పనులు కూడా చేస్తుందనిపించింది. 50 పేజీల్లోనే పత్రిక వైవిధ్య భరితంగా ఉంది. చక్కటి శీర్షికలున్నాయి. కవిత్వం మీద మీ ప్రత్యేక శ్రద్ధ బాగా కనిపిస్తోంది. పత్రిక ద్వారా చాలా మందిని మళ్ళీ కలిసినట్లైంది.  ప్రొ. గణేశ్వర రావు గారి కథా విశ్లేషణ  శీర్షికలో ముకుంద రామారావు గారి కథను విశ్లేషించిన  తీరు చెహోవ్ కథతో  పోలిక బావుంది.  కవి మణిందర్ గారితో విల్సన్ రావు గారి ఇంటర్వ్యూ లో మాణిక్యాల రావు గారు తన గురువుగారు ఫ్రముఖ కవి కీ శే ఎండ్లూరి సుధాకర్ గారిని గుర్తుచేసుకోవడం సముచితం.  రామకవచం గారి కవితాస్త్రం లో ఆచార్య గోపీ గారి కవిత పరామర్శ శాస్త్ర బద్ధంగా ఉంది.   బాలాజీ గారి కవిత  పసి పిల్లలతో ఆడుకోవడం లో ఉండే మనసు తేలికవడాన్నీ, ఆనందాన్నీ,  త్రుప్తినీ, ఫలితంగా జీవనం లో కలిగే పునరుత్తేజాన్నీ రుచి చూపించింది.  గద్దర్ గారి మీద శిఖా ఆకాష్ కవిత, డా పద్మారావు గారి "వారే విజేతలు" కవితలో " వారు బహు ధ్వనులు  బహుజనులు ...